వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి

భారత్ న్యూస్ ఢిల్లీ….…వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి

పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే ప్రధానమంత్రి మోదీ- కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ కు వచ్చారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న లోక్సభస్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభాపక్ష నేత జేపీనడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలను మోదీ పలకరించి, ముందుకువెళ్లారు.

మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలో వీరిమధ్య చోటుచేసుకున్న ఈ చిన్నపాటి సంభాషణ ఆకట్టుకుంటోంది.