పాకిస్తాన్ పై భారతదేశం ఆర్థిక దాడి…

పాకిస్తాన్ మీద ఆర్థిక దాడి చేసేందుకు భారత్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉగ్ర సంస్థలకు ఫండింగ్ చేస్తున్నందుకు తగిన శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఫైనాన్షియల్ దాడి మొదలు పెట్టింది. పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఐఎంఎఫ్ నిధుల కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ఎఫ్ఏటీఎఫ్ చర్యలే కీలకమని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి జరగనున్న ఎఫ్ఏటీఎఫ్ భేటీలో పాకిస్తాన్ మీద నిఘా పెంచాలన్న ప్రతిపాదన భారత్ తీసుకురానుంది. గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్ 2022లో బయటపడింది. అప్పట్లో మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్ అడ్డుకుంటామంటూ పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడింది.