భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇండియాలో హై అలర్ట్
ఢిల్లీలో ఎర్రకోట కారు బాంబు ఘటన మరువక ముందే మరో ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐఎస్ఐ సహకారంతో ఉగ్రవాదులు దాడులకు కుట్రలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు మెట్రో నగరాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పండుగల వేళ మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థన మందిరాలపై ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
