భారత్ న్యూస్ ఢిల్లీ…..అమరవీరుడి కూతురికి సైనికుల కన్యాదానం… మనసుల్ని కదిలించిన ఘట్టం
తండ్రి స్థానంలో నిలిచిన 50మంది సైనికులు… అమరవీరుడి కూతురికి కన్యాదానం
అమరవీరుడి కూతురికి 50 మందికి పైగా సైనికుల కన్యాదానం: తామంతా ఒకే కుటుంబమని నిరూపించిన యోధులు.
ఆర్మీలో చేరి అమరవీరులైన యోధుల కుటుంబాలకు సైనికులు ఎప్పటికీ తోడుంటారని మరోసారి రుజువైంది.
ఇటీవల గ్రేటర్ నోయిడాలోని దబ్రా గ్రామంలో అమరవీరుడు సురేష్ సింగ్ కూతురు ముస్కాన్ వివాహానికి ఏకంగా 50మందికి పైగా సైనికులు తరలివచ్చారు.

2006లో కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సురేష్ సింగ్ వీరమరణం పొందారు.
దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆమె తండ్రి స్థానంలో నిలబడి కన్యాదానం చేశారు. తామంతా ఓ కుటుంబమేనని నిరూపించారు. ఈ వీడియోను చూసి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.