భారత్ న్యూస్ ఢిల్లీ….సిమెంట్‌పై జీఎస్టీ తగ్గింపు.. ఇప్పుడెంత శాతమంటే..!!
GST on cement | దిల్లీ: సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ రేట్ల స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగానే సిమెంట్‌పై కూడా జీఎస్టీ రేటును తగ్గించింది.
సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో నిర్మాణ వ్యయం తగ్గి, వినియోగదారులు, రియల్ ఎస్టేట్ రంగం లాభపడతాయని రియల్టర్స్ బాడీ క్రెడాయ్ (CREDAI) గురువారం తెలిపింది.
”సిమెంట్‌పై జీఎస్టీని తగ్గించడం ఒక మైలురాయి. ఇది రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలపై విప్లవాత్మక ప్రభావం చూపనుంది” అని క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ పటేల్ తెలిపారు. జీఎస్టీ తగ్గడంతో భారత సిమెంట్ పరిశ్రమ గ్లోబల్ పోటీదారులతో సమాన స్థాయిలో నిలుస్తుందని సిమెంట్ తయారీదారుల అసోసియేషన్ (సీఎంఏ) పేర్కొంది. ఇది పోటీతత్వాన్ని పెంచడంలో తోడ్పడుతుందని తెలిపింది. “స్టీల్ వంటి ఇతర కట్టడ నిర్మాణ పదార్థాలతో పోలిస్తే సిమెంట్‌పై అత్యధిక పన్ను విధించారు. ఇప్పుడు 18 శాతానికి తగ్గించడం ఇతరవాటితో సమానంగా ఉంది” అని సీఎంఏ అధ్యక్షుడు, శ్రీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అఖౌరి తెలిపారు.
సిమెంట్‌పై పన్ను తగ్గింపుతో దేశ మౌలిక వసతుల ప్రాజెక్టులపై వేగం పెరగడంతో పాటు పరిశ్రమ విస్తరణకు ఊతమివ్వనుందని, భారత్ మల్టీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనించడానికి మరింత బలాన్ని అందిస్తుందని అదానీ సిమెంట్ యాజమాన్యం తెలిపింది. “ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు. విశ్వాసం, వేగం, లక్ష్యం అన్నీ కలగలిపిన సంకేతం. రాబోయే అభివృద్ధి దశ బలమైన, తెలివైన, సుస్థిరమైన పునాది మీద నిలుస్తుందన్న హామీ ఇది” అని అదానీ సిమెంట్ సీఈఓ వినోద్ బహేటీ పేర్కొన్నారు. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊరట అని గ్రాంట్ థార్న్టన్ భారత్ భాగస్వామి, ట్యాక్స్ కాంట్రవర్సీ మేనేజ్మెంట్ లీడర్ మనోజ్ మిశ్రా తెలిపారు. ” గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో నిర్మాణ పదార్థాల ఖర్చు మొత్తం వ్యయాల్లో 30-35 శాతం ఉంటుంది. అందులో సిమెంట్ అత్యంత ఖరీదైనది” అని ఆయన తెలిపారు.
సీఎంఏ డేటా ప్రకారం భారత సిమెంట్ పరిశ్రమ వార్షికంగా దాదాపు 700 మిలియన్ టన్నుల ఇన్స్టాల్డ్ కెపాసిటీ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో విలీనాలు జోరుగా జరుగుతున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్, అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ సిమెంట్ చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి
