భారత్ న్యూస్ ఢిల్లీ…..మహారాష్ట్ర :
దేశంలోనే తొలి ఈ-ట్రాక్టర్ రిజిస్టర్
మహారాష్ట్ర లోని ఠాణెలో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను ఆదివారం రిజిస్టర్ చేశారు.
దీనిని ఆ రాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రారంభించారు.
డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చు సున్నా, ఇంధన ఖర్చు 60-70% తగ్గుతుంది.
ఎకరం పొలం దున్నడానికి కేవలం రూ.300 ఖర్చవుతుందని తయారీ సంస్థ తెలిపింది.

ప్రభుత్వం ఈ ట్రాక్టర్ కొనుగోలుపై రూ.15 లక్షల వరకు రాయితీ ఇస్తోంది.