రేయ్ రేయ్…ఏంట్రా నీ వెర్రి వేషాలు…ఇంట్లో వారికి కాస్త ఉపయోగపడే పనులు చేయరా బాబు…ఇలా పిచ్చి వేషాలు ఏంట్రా నాయనా… ప్రాణాలు పణంగా పెట్టి మరీ.. అవసరమా!

భారత్ న్యూస్ ఢిల్లీ…..రేయ్ రేయ్…ఏంట్రా నీ వెర్రి వేషాలు…ఇంట్లో వారికి కాస్త ఉపయోగపడే పనులు చేయరా బాబు…ఇలా పిచ్చి వేషాలు ఏంట్రా నాయనా… ప్రాణాలు పణంగా పెట్టి మరీ.. అవసరమా!

యూపీలో రీల్స్ పిచ్చిలో పడి ప్రమాదకర స్టంట్స్ చేసిన అజయ్ రాజ్‌బర్ అనే యువకుడికి పోలీసులు గట్టి గుణపాఠం చెప్పారు.

వేగంగా రైలు వస్తున్న క్రమంలో రాజ్‌బర్ ట్రాక్ పై పడుకుని వీడియో రికార్డ్ చేశాడు.

ఆ తర్వాత ఇలాంటి పనులు చేయొద్దని ఇతరులకు హితోపదేశం చేశాడు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పిచ్చివేషాలు వేయవద్దని, చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.