త్రిల్లర్ సినిమాను మించిన క్రైమ్ స్టోరీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..త్రిల్లర్ సినిమాను మించిన క్రైమ్ స్టోరీ

ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నం

బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఉగార గ్రామానికి చెందిన చైతాలి, ప్రదీప్‌లది ప్రేమ వివాహం

చైతాలి గర్భం దాల్చగా.. మరోవైపు మరో మహిళని ప్రేమించి, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రదీప్

చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి చెడిపోతుందని భావించి.. ఆమెను చంపేయాలని ప్లాన్

ఇందుకు తన స్నేహితులైన సద్దాం అక్బర్‌, రాజన్‌ గణపతిల సహాయం తీసుకున్న ప్రదీప్

ఆదివారం సాయత్రం ఆసుపత్రికి వెళ్దామని.. ద్విచక్ర వాహనంపై చైతాలిని తీసుకెళ్లిన ప్రదీప్

మూత్ర విసర్జన చేయాలని ఓ చోట బైక్ ఆపగా.. కారులో వచ్చి బైక్‌ని ఢొకొట్టిన ప్రదీప్ ఫ్రెండ్స్

చైతాలికి స్వల్ప గాయాలవ్వడంతో.. అదే కారులో ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు నాటకం

కారు ఎక్కాక రాడ్‌తో కొట్టి చైతాలి హత్య.. ప్రమాదంలో భార్య చనిపోయిందని ప్రదీప్ డ్రామా

ప్రమాద స్థలాన్ని పరిశీలించినప్పుడు అనుమానం.. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

చివరికి మరో మహిళ కోసమే చైతాలిని హత్య చేసినట్టు ప్రదీప్ అంగీకారం.. ఫ్రెండ్స్ కూడా అరెస్ట్