ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరం: పార్లమెంటు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరం: పార్లమెంటు

📍ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవారు (AI Content Creators) కచ్చితంగా లైసెన్స్లు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానల్ సూచించింది. దీంతో ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే మార్గాలను కోరింది. ఈ కమిటీ ఇటీవలే తమ ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. వచ్చే సీజన్ సమావేశాల్లో దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.