చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి ప్రభుత్వ కాంట్రాక్టుల బిడ్డింగ్‌కు అనుమతిచ్చే అంశంపై భారత ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది

భారత్ న్యూస్ ఢిల్లీ….చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి ప్రభుత్వ కాంట్రాక్టుల బిడ్డింగ్‌కు అనుమతిచ్చే అంశంపై భారత ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చిన క్రమంలో హైదరాబాద్ కంపెనీ బీహెచ్ఈఎల్ షేరు ఒక్కసారిగా కుప్పకూలింది. ఏకంగా 10 శాతం మేర పడిపోయింది. అయితే, రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయింది. మరుసటి రోజునే ఈ స్టాక్ వేగంగా కోలుకుంది. ఈరోజు లాభాల్లో ట్రేడవుతోంది.