చైనా పర్యటనలో కేంద్రమంత్రి

భారత్ న్యూస్ ఢిల్లీ…..చైనా పర్యటనలో కేంద్రమంత్రి

విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. 2020లో గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.