భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎయిర్ పోర్టుకు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) లో బాంబు పెట్టినట్లు ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు మెయిల్స్ వచ్చాయి. ఎయిర్‌పోర్టుతో పాటు రెండు స్కూళ్లు, కొన్ని సంస్థలలో కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామని దుండగులు బెదిరించారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టులో, బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో భారీ తనిఖీలు చేసి, భద్రతను పెంచారు. ఈ బెదిరింపులు స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీశాయి….
