పెద్దల సభలో 102కు పెరిగిన బీజేపీ బలం

భారత్ న్యూస్ ఢిల్లీ…..పెద్దల సభలో 102కు పెరిగిన బీజేపీ బలం

వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరిగింది. ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన ముగ్గురు ఎంపీలు ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్ సింగ్ శ్రింగ్లా, సీ సదానందన్ అధికారికంగా బీజేపీలో చేరారు. దీంతో పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 102కి చేరింది.

2022 ఏప్రిల్ తర్వాత బీజేపీ సభ్యుల సంఖ్య రెండోసారి 100 మార్క్ దాటింది.