భారత్ న్యూస్ ఢిల్లీ…..బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 136 మంది మహిళలు సహా 1,302 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని 3.7 కోట్లకు పైగా ఓటర్లు నిర్ణయిస్తారు.
ప్రచారానికి చివరి రోజైన ఈరోజు, సీనియర్ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, NDA, మహాఘటబంధన్, ఇతర పార్టీల అగ్ర నాయకులు అనేక బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
