ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలోకి రావాలి: అమిత్ షా

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలోకి రావాలి: అమిత్ షా …..

ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలో కలిసి రావాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. రాయ్‌పుర్‌ అటల్‌ నగర్‌లో ఆయన ఆదివారం మాట్లాడారు. ‘ప్రతిసారి వర్షాకాలంలో పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. కానీ, ఈసారి వర్షాకాలంలో వారిని నిద్రపోనివ్వం. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు……