15 నిమిషాల్లో సరుకులు డోర్‌ డెలివరీ.. అంబులెన్స్‌ ఆలస్యంతో మరణిస్తున్నా పట్టదు: జయా బచ్చన్,

భారత్ న్యూస్ ఢిల్లీ..15 నిమిషాల్లో సరుకులు డోర్‌ డెలివరీ.. అంబులెన్స్‌ ఆలస్యంతో మరణిస్తున్నా పట్టదు: జయా బచ్చన్

సరుకులు 15 నిమిషాల్లోపు ఇంటింటికి చేరుతున్నాయని అమితాబ్‌ బచ్చన్‌ భార్య, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. అయితే అంబులెన్స్‌ల ఆలస్యంతో రోగులు ఆసుపత్రికి చేరుకోలేక రక్తస్రావంతో మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబులెన్స్‌ల కోసం రోడ్లపై ప్రత్యేకంగా అత్యవసర లేన్లు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా జయా బచ్చన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. 2018లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రత్యేక అత్యవసర లేన్‌లు లేవు. ఈ విషాదాలను జాతీయ డేటా ఏదీ ట్రాక్ చేయదు’ అని అన్నారు.