భారత్ న్యూస్ ఢిల్లీ…..వెనెజువెలాపై అమెరికా దాడిలో 40 మంది మృతి
ఆహారం, చార్జింగ్ కోసం తీవ్ర అవస్థలు
వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షుడు నికొలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరస్‌ను అగ్రరాజ్యం అమెరికా బందీగా పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకుపోయిన క్రమంలో ఆ దేశ రాజధాని కారకాస్, పొరుగున ఉన్న నగరాల్లో తీవ్ర భయం, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆహారం కోసం పెద్దయెత్తున ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల అంధకారం అలముకుంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో చాలామంది ఇండ్లకే పరిమితమై పోయారు.

చాలా సూపర్‌మార్కెట్లు మూతపడ్డాయి. తెరిచి ఉంచిన చిన్నచిన్న దుకాణాల వద్ద 500-600 మంది బారులు తీరారు.