ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్‌లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా

భారత్ న్యూస్ అనంతపురం..ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్‌లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని నాలుగు ప్రధాన నగరాలపై దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామం దీర్ఘకాలిక యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఈ అర్ధరాత్రి నుంచే ప్రతిదాడులు ప్రారంభించనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది.