భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత ఎగుమతులపై ఈయూ పిడుగు.. తీవ్రంగా నష్టపోనున్న భారతీయ గార్మెంట్స్ రంగం
🇪🇺 భారతీయ ఎగుమతుల్లో అత్యధిక వస్తువులపై ఇస్తున్న జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్పీ) రాయితీలను ఈయూ ఈ ఏడాది జనవరి 1 నుంచి రద్దు చేసింది.
దీని ఫలితంగా ఈయూకు ఎగుమతి అయ్యే భారతీయ ఎగుమతుల్లో 87 శాతం అధిక దిగుమతి సుంకాలను చెల్లించాల్సి వస్తుందని గ్రోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తన నివేదికలో వెల్లడించింది.
ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బలహీనంగా ఉన్న తరుణంలో దిగుమతి సుంకాల పెంపు భారతీయ ఎగుమతిదారులకు పెను భారం కానున్నది.
