భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్ తో కలిసి ప్రపంచ శాంతికి కృషి చేస్తాం’
భారత ప్రధాని మోదీని కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను తాము భుజాన వేసుకున్నామని చెప్పారు. డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపికని అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగిస్తూ.. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం పాటుపడతామని చెప్పారు. .
