బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.డిసెంబర్ 30
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్స్పెక్షన్ రావడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ మరింత వేగంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం 6:00 గంటలకు తుది శ్వాస విడిచారు.. 1945 ఆగస్టు15న అవిభక్త భారతదేశంలోని పశ్చిమ్ బెంగాల్లో జన్మించిన ఖలిదా జియా,బీఎన్పీ ఛైర్‌పర్సన్‌ గా ఆ దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు.

బంగ్లా విమోచన యుద్ధం లో ఆమె భర్త జియావుర్ రెహమాన్ పాక్‌పై తిరుగు బాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1981లో ఆయన హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ అధ్యక్షురాలిగా ఖలీదా పగ్గాలు చేపట్టారు.

పదేళ్ల తర్వాత ప్రధాని అయిన ఆమె.. 1991-96, 2001-06 మధ్య కాలంలో పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ దేశంలో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారామె. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఆ సమయంలో బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఓ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు కూడా.