అలంపూర్ ఏరియా హాస్పిటల్ ని సందర్శించిన సంపత్ కుమార్

..భారత్ న్యూస్ హైదరాబాద్….అలంపూర్ ఏరియా హాస్పిటల్ ని సందర్శించిన సంపత్ కుమార్

జోగులాంబ గద్వాల జిల్లా లోని అలంపూర్ చౌరస్తా వద్దగల వంద పడకల ఆసుపత్రిని ఈరోజు ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు సందర్శించడం జరిగింది.

అక్కడి ఆసుపత్రి సిబ్బంది మరియు వైద్యులతో చర్చించి వెంటనే ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి కృషితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామని అన్నారు.

సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ

పెద్ద టిఆర్ఎస్ పరిపాలనలో ఎలక్షన్ల కోసం ఒక పావుగా వాడుకున్న ఆసుపత్రి నేడు శిథిల వ్యవస్థకు చేరిందని ఎంతోమందికి వైద్య ఆరోగ్య సేవలందించాల్సిన ఆసుపత్రి ఇలా ఉండడం చాలా బాధాకరమని ఆయన అన్నారు

ఆస్పత్రిలో అవసరమైన ఎక్విప్మెంట్ మరియు సిబ్బంది మీ వెంటనే నియమించాలని సంబంధిత మంత్రిగా దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే అలంపూర్ ఏరియా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు.

నియోజకవర్గ ప్రజలందరికీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఆది అని సంపత్ కుమార్ గారు తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అలంపూర్ నియోజకవర్గంలో చేసుకొనే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారి వెంట ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్డెంట్ సయ్యద్ గారు మరియు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ వినోద్ కుమార్ గారు మరియు జోగులాంబ దేవాలయ కమిటీ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి గారు మరియు అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల అధ్యక్షులు పదాధికారులు ముఖ్య నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.