.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు.. పసికందులని అమ్మకానికి పెడుతున్నారు
తెలంగాణ : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు.. పసికందులని అమ్మకానికి పెడుతున్నారు
హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు సరైన అనుమతులు లేవని డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని యాజమాన్యం నమ్మించింది. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేసినట్టు తెలిపారు. గతంలోనూ విశాఖలో డాక్టర్ నమ్రత ఇదే విధంగా రూ.కోట్ల దందా చేసినట్లు తెలిపారు. గతంలో రూ.90 వేలకు కొని రూ.30 లక్షలకు ఓ బిడ్డను కలకత్తాలోని ఓ దంపతులకి అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.
