..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో MBBS కౌన్సెలింగ్కు ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి
అమరావతి :
ఏపీరాష్ట్రంలో 2025-26విద్యా సంవత్సరానికి MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ వెలువడనుందని, విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణపత్రాలను సిద్దం చేసుకోవాలని
హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల తాత్కాలిక జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పత్రాలను విద్యార్థులు ముందుగానే సమకూర్చుకుంటే నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.
