విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్‌లు

భారత్ న్యూస్ గుంటూరు..విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్‌లు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో డ్యాన్స్‌లు చేసిన ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు

మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్..

దీంతో విధి నిర్వహణ సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి డ్యాన్స్‌లు చేశారని వెలువెత్తిన విమర్శలు

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.. విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ

అదే సమయంలో డ్యాన్స్‌లను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.