భారత్ న్యూస్ ఖమ్మం…..యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న MRI చార్జీలు..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతను సృష్టించింది. దీనివల్ల భారత్ లోని MRI సేవలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. MRI మాగ్నెట్లను చల్లబరచడానికి హీలియం చాలా అవసరం. ప్రపంచ హీలియం ఉత్పత్తిలో మూడింట ఒక వంతు ఖతార్ నుండే వస్తుంది. ఇరాన్ దాడుల్లో ఖతార్లోని గ్యాస్ తయారీ స్టేషన్ ధ్వంసం అవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీని ప్రభావంతో స్కాన్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తక్షణ సంక్షోభం ఏదీ లేనప్పటికీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే సేవల్లో అంతరాయం తప్పదంటున్నారు నిపుణులు••£
