ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు

భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు

ఏపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300 పడకల స్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ఏర్పాటుకు కేంద్రం రూ.1,095 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 8 నుంచి 14% దాకా పెరిగిందన్నారు.