భారత్ న్యూస్ రాజమండ్రి….40 ఏళ్లకే హార్టెటాకులు వస్తున్నాయి అని లబో దిబో అంటున్నారు….రాకేం చేస్తాయి వాటి వెనుక అసలు సూత్రాలు వేరే ఉన్నాయి…
అతడికి సిగరెట్ తాగే అలవాటు లేదు…మందు అసలే ముట్టుకొడు…మరి 40 ఏళ్లకే గుండెపోటుతో పోయాడు…. ఎలా..హౌ….?
కుయ్యో మొర్రో ఏడుపులు ..మంచివాళ్లకే త్వరగా మరణం అనే క్యాప్షన్ తో ఇచ్చే సెండాఫ్ లు
కొన్ని రాష్ట్రాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న వయాగ్రా మందుల మాఫియా…నిజానికి అవేవి authorized medicines కాదు… పైగా దాని related medicines కూడా prescription లేకుండా అసలే ఇవ్వకూడనివి కదా…
కానీ ఇప్పుడు న్యూస్ చూస్తేనేమో విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్న మెడికల్ షాపులు…
కొనే వాళ్ళ డిమాండ్ ని బట్టి అమ్ముకునే మాఫియా తయారయ్యేది….ఒక్క వయాగ్రానే కాదు..ప్రేగ్నెన్సీ కిట్ లు, అబార్షన్ టాబ్లేట్లు…ఇలా ఓపెన్ గా చెప్పాలి అంటే జీవితాల్ని సర్వనాశనం చేసే దరిద్రాన్ని అంతా అమ్మేస్తున్నారు…యువత కొనేస్తున్నారు….
ఒక్క ఏలూరు లో తనిఖీ చేశారు కాబట్టి బయట పడింది ఈ రాకెట్…ఇలా తనిఖీ లు నిర్వహిస్తే దేశం మొత్తంలో ఈ దందా ఏ తీరుగా ఉందొ వేరే చెప్పక్కర్లేదు…
అసలు ఏంటి ఈ వయాగ్రా….?
వయాగ్రా (Viagra) అనేది సిలడెనఫిల్ సిట్రేట్ (Sildenafil Citrate) అనే ఔషధం..
మనిషి యొక్క ఆలోచనలతో సంబంధం లేకుండా రక్త ప్రసరణని పెంచే ఔషధం అన్నమాట…
వాడితే ఏమవుతుంది?
30 నిమిషాల్లో ప్రభావం మొదలవుతుంది
ఎక్కువగా 30 నిమిషాల లోపల పనిచేస్తుంది. ప్రభావం 4 నుండి 6 గంటల వరకు ఉండొచ్చు.
100% ప్రతికూల ప్రభావాలు (Side effects):
తలనొప్పి
ముఖం ఎర్రబడడం
జీర్ణక్రియ సమస్యలు
ముక్కు దిబ్బగా ఉండడం
కంటి చూపులో మార్పులు (వీలైనంత తక్కువగా)
నిదానంగా గుండె బరువుగా అనిపించడం…
ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ గుండెకు సంబంధించిన ఔషధాలు (నైట్రేట్స్) వాడుతున్నవారు…హై బీపీ ఉన్నవాళ్లు అంటే బీపీ టాబ్లెట్స్ వాడుతున్నవారు ఇవి ఎంత మాత్రం వాడకూడొద్దని చెప్తున్నారు…
ఇవి వాడే పురుషుల్లో రాను రాను మానసిక ఒత్తిడి విపరీతంగా ఎక్కువై ఇవి లేనిదే ఇంకా ఎందుకూ పనికిరాము అనే రుగ్మత మొదలవుతుంది…దాని వల్ల అధిక కోపం ..ప్రతీ చిన్నదానికి అరవడం..ఇంక జీవితం లో ఎందుకూ పనికిరాని వారిలా వారిని వారు తక్కువ చేసుకుంటూ మానసిక వత్తిడి కి లోనవ్వడం…
ఏ చేడు అలవాట్లు లేని యువత ఆకస్మిక మరణానికి ..గుండె పోటుకి కారణం ఇదీ అని ఎవ్వరికీ అంతుపట్టపోవడం…
-----------------
ఇక అమ్మాయిల్లో…విచ్చలవిడిగా గర్భ నిరోధక మాత్రలు వాడితే….
గర్భాశయానికి (Uterus) హాని కలగొచ్చు..
మళ్ళీ గర్భం ధరించడంలో సమస్యలు రావచ్చు
ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది తప్పు పద్ధతిలో వాడితే
హార్మోన్ల అసమతుల్యత
పీరియడ్స్ అస్తవ్యస్తం అవుతాయి
PCOD/PCOS లాంటి సమస్యలు వచ్చే అవకాశం
భావోద్వేగాల పరమైన సమస్యలు
బాధ, కలత, మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం…
ఇవి మాత్రమే కాదు…మగవాడు గుండె పోటుతో గుటుక్కుమంటాడు కానీ ఆడవారికి బ్రతికినంత కాలము నరకమే…
హార్మోనల్ అసమతుల్యత…. జుట్టు పోవడం మొదలవుతుంది
బరువు పెరగడం, నీరు నిల్వ అయ్యే సమస్య, weight gain
గర్భం ధరించడంలో ఆలస్యం
మందులు ఆపిన తరువాత కూడా కొన్ని నెలలపాటు హార్మోన్లు బ్యాలెన్స్ అయ్యేందుకు టైం పడుతుంది
రక్తం గడ్డకట్టే ప్రమాదం…
ఏ విధంగా చూసుకున్నా విచ్చలవిడిగా శృంగారం భవిష్యత్తు శూన్యం…
ప్రస్తుతం సుఖం అనుభవిస్తే చాలు రేపటి రోజు ఉందొ లేదో ఎవడికి తెలుసు అని ఆలోచనలున్న యువత….
ఎప్పుడూ అసంతృప్తితో బ్రతికే జనాలు తీసుకునే నిర్ణయాలకు… రోగాలకు ,ఆకస్మిక మరణాలకు సిద్ధంగా ఉండండి…

సక్రమంగా బ్రతికితేనే సక్కగా ఉంటాయో లేదో నమ్మకం లేని బ్రతుకులు..
అలాంటిది పనిగట్టుకుని అక్రమంగా బ్రతికితే అన్యాయమైపోక ఇంకేమైపోతారు చెప్పండి….