డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది??

భారత్ న్యూస్ అనంతపురం…డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది??

ఇది డెంగ్యూ అనే వైరస్ వల్ల, ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటు వల్ల వస్తుంది.

ఇది మంచి నీళ్ల లో మాత్రమే ఉంటుంది.

ఇది ఉదయం 5.00 నుండి 7.00 లోపు మరియు సాయంత్రం 5.00 నుంచి 7.00 లోపు మాత్రమే కుడుతుంది.

మోకాలు కింది భాగాన, మోచేతి కింది భాగాన మాత్రమే కుడుతుంది.

ఈ దోమ కుట్టిన వారం రోజుల తర్వాత 103 నుండి 106 వరకు జ్వరం వస్తుంది.

విపరీతంగా వళ్ళు నొప్పులు, కను గుడ్లు దగ్గర నొప్పి ఉంటుంది.

ప్లేట్ లెట్స్ తగ్గటం మొదలు అవుతుంది.

సాధారణంగా 1ml రక్తం లో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి.

50,000 వరకు భయపడవలసిన అవసరం లేదు.

50,000 కంటే తగ్గితే అపుడు హాస్పిటల్ కి వెళ్లి , ప్లేట్ లెట్స్ ఎక్కించుకోవాలి.

100 మంది డెంగ్యూ వచ్చిన వారిలో 90 మందికి వైద్యం అవసరం లేకుండానే నయం అవుతుంది.

వాస్తవానికి ఈ వ్యాధికి మందులు ఏమీ లేవు.

చేయగలిగినది అంతా మనిషి దెబ్బతినకుండా చూడటం.

అంటే జ్వరం కంట్రోల్ చేయటం,సెలైన్ పెట్టటం.బీపీ కంట్రోల్ చేయడం, అవసరాన్ని బట్టి రక్త కణాలు ఎక్కించటం.