నేటి అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు!

భారత్ న్యూస్ తిరుపతి..డిసెంబర్ 29…నేటి అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు!


Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమల తిరుపతి భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా ఏర్పాటు చేసినట్లు తి తి దే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలిరోజు ప్రోటోకాల్ దర్శనాలు ముగిసిన తర్వాత వెంటనే స్లాటేడ్ సర్వదర్శనం మొదలవుతుంది, సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి మంగళవారం రాత్రి 11:45 గంటల మధ్య 20 గంటల పాటు సామాన్యులకే అవకాశం కల్పిస్తామన్నా రు.సుమారు 70, వేల మందికి దర్శనం కేటా యించాలన్నది లక్ష్యం అన్నారు.

మొదట వీఐపీలకు, ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. ఈ దర్శనం జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు, మొత్తం పది రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ దర్శనం జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు.. మొత్తం పది రోజుల పాటు భక్తులకు కల్పిస్తారు.

తొలి మూడు రోజులు అనగా.. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

టీటీడీ ప్రజా సంబంధాల విభాగం, SVBC, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పపడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకన్లు లేని భక్తులు జనవరి 02వ తేదీ నండి 08వ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించు కోవాలి’ అని టీటీడీ సూచించింది.

టీటీడీ డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో శ్రీవారి దర్శనానికి టోకెన్లు ఉన్న భక్తులనే అనుమతిస్తుంది. ఈ మూడు రోజుల్లో, భక్తులు తమ ఆధార్‌ కార్డుతో పాటు, టీటీడీ కేటాయించిన టోకెన్ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలి. జనవరి 2 నుంచి 8 వరకు మాత్రం ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

మొదటి మూడు రోజుల్లో, దర్శన సమయాలను బట్టి భక్తులను వేర్వేరు మార్గాల ద్వారా అనుమతిస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్‌ టోకెన్‌ పొందినవారిని కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి పంపిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్‌ నుంచి ఆల యంలోకి అనుమతిస్తారు. ఇక సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఈ కొత్త నిబంధనల వల్ల భక్తుల రద్దీని నియంత్రించి, అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. టోకెన్ల విధానం వల్ల వేచి ఉండే సమయం కూడా తగ్గుతుందని ఆశిస్తున్నారు. జనవరి 2 నుంచి సర్వద ర్శనం అందుబాటులోకి రావడం వల్ల, టోకెన్లు పొందలేని భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకోవచ్చు’ అని టీటీడీ తెలిపింది.