సోషల్ మీడియా ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్.

భారత్ న్యూస్ తిరుపతి…సోషల్ మీడియా ద్వారా శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం – నిందితుడు అరెస్ట్.

టీటీడీ లోగో దుర్వినియోగం చేసి భక్తులను మోసం చేసిన తమిళనాడు వ్యక్తిపై కేసు.

భక్తులు అప్రమత్తంగా ఉండాలి –అధికారిక మార్గాల ద్వారానే దర్శనం టిక్కెట్లు పొందాలి.

తిరుపతి /తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూరు జిల్లాకు చెందిన సి. సెంథిల్ కుమార్ (47 సంవత్సరాలు) ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో WhatsApp, Facebook, Instagram వంటి సోషల్ మీడియా వేదికలలో త్వరితగతిన శ్రీవారి దర్శనం. అత్యంత సమీపంలో దర్శనం వంటి తప్పుడు ప్రకటనలతో భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ మరియు తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కేసులు నమోదు చేయడం జరిగింది.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమల సబ్‌డివిజన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు వీరికి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతంలో దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు:

సోషల్ మీడియా ద్వారా “VIP దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తప్పుడు ప్రచారం TTD లోగోను దుర్వినియోగం చేసి భక్తులను నమ్మబలికించడం ఒక్కో టిక్కెట్‌కు సుమారు ₹16,500/- వసూలు చేయడం కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, PhonePe ద్వారా డబ్బులు స్వీకరించడం, నకిలీ హామీలతో భక్తులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని వద్దనుండి ఒక Dell ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లు (Poco, iQOO) ఈ పరికరాలలో దర్శనం టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించిన డేటా, AI వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు లభించాయి.

నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరిగినది.

ప్రజలకు సూచనలు:

తిరుమల దర్శనం టిక్కెట్లు కేవలం అధికారిక TTD వెబ్‌సైట్ లేదా అనుమతించబడిన కౌంటర్ల ద్వారానే పొందాలి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మకండి అనుమానాస్పద సమాచారం ఉన్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి ఎవరికీ ముందస్తుగా డబ్బులు పంపించవద్దు.

గూగుల్ సెర్చ్‌లో గెస్ట్ హౌస్ పేర్లతో కనిపించే వెబ్‌సైట్లు అన్నీ అధికారికం కావు, అధికారిక TTD వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తూ “శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దర్శనం, వసతి పేరుతో మోసాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాము” అని తెలిపారు.