భారత్ న్యూస్ తిరుపతి…నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఆంధ్రప్రదేశ్ : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను మంగళవారం ఆలయ సన్నిధిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశగా భూదేవిని పూజించి మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసి క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంచనున్నారు….
