భారత్ న్యూస్ తిరుపతి.వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడు రోజుల్లో..మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతి
- టీటీడీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని
- 30వ తేదీ ఏకాదశి,
- 31 ద్వాదశి,
- జనవరి 1వ
- తేదీలకుసంబంధించి 1.76 లక్షల మందికి ఈ-డిప్ విధానంలో ముందస్తుగానే స్లాటెడ్ సర్వ దర్శన టోకెన్లను కేటాయించింది.
👉 రోజుకు 60,000+ మందికి 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేయగా, వీరికి ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
1) ఉదయం స్లాట్ల వారిని కృష్ణతేజ సర్కిల్ నుంచి,
2) మధ్యాహ్నం స్లాట్ల వారిని ఏటీజీహెచ్ నుంచి,
3) రాత్రి స్లాట్ల వారిని శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నారు.

⚠️ Note:- ఈ మూడురోజుల పాటు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలూ ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది .