షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.

భారత్ న్యూస్ ఢిల్లీ…..షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.

రోజుకు మూడు సార్లు మాత్రమే బ్రేక్ దర్శనం

షిర్డీ :

షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్. ఇకనుంచి వీఐపీలు రోజుకు మూడుసార్లు మాత్రమే బ్రేక్ దర్శనం పొందుతారని సాయి బాబా సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ తెలిపారు. అధికారిక సిఫార్సులు లేదా ప్రత్యేక పాస్లు ఉన్న భక్తులకు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు అలాగే రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారని ఆయన తెలిపారు.