భారత్ న్యూస్ గుంటూరు…శ్రీ గంగానమ్మ తల్లి సేవలో విక్కుర్తి.
అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగానమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు, VVR ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు దర్శించుకున్నారు.
శ్రీ గంగానమ్మ తల్లి 51వ జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చారు.
వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ గంగానమ్మ అమ్మవారిని విక్కుర్తి శ్రీనివాస్, విక్కుర్తి రాంబాబులు దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విక్కుర్తి సోదరులను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం శ్రీ గంగానమ్మ తల్లి వార్షిక జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్ అభినందించారు.
దివిసీమ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నట్లు విక్కుర్తి శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బడే వీరబాబు ,నాగం బాపయ్య, మాచర్ల భీమయ్య, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీను రేపల్లె ముసలయ్య, బర్మా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.