భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయం!

భారత్ న్యూస్ తిరుపతి….భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయం!

తిరుమల :

ఏపీలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. టీటీడీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఇది అమల్లోకి వస్తే దేశంలోనే మొదటిసారిగా ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఇలాంటి బీమా సౌకర్యం కల్పించినట్లు అవుతుంది.