పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాల్లో సినీనటి ఐశ్వర్య రాయ్, క్రికెట్ దిగ్గజం సచిన్

భారత్ న్యూస్ అనంతపురం…పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాల్లో సినీనటి ఐశ్వర్య రాయ్, క్రికెట్ దిగ్గజం సచిన్

Ammiraju Udaya Shankar.sharma News Editor…పుట్టపర్తి, నవంబర్ 18: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరలివచ్చారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహా సమాధిని సినీ నటి ఐశ్వర్యరాయ్ దర్శించుకున్నారు.

అటు, సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా పుట్టపర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సచిన్ టెండూల్కర్ తో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు, సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని సచిన్ టెండూల్కర్ దర్శించుకున్నారు..