వివాదంలో శబరిమల అయ్యప్ప ఆలయం!

భారత్ న్యూస్ మంగళగిరి…వివాదంలో శబరిమల అయ్యప్ప ఆలయం!

కేరళ (పతనం తిట్ట జిల్లా) :

శబరిమల :

శబరిమలలోని సన్నిధానం లోని ద్వారపాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం రేకులను తొలగించడంపై ఆరోపణలు వచ్చాయి. చంద్రగ్రహణం పేరుతో విగ్రహాలకు ఉన్న బంగారు రేకులను తొలగించి అక్రమ రవాణా చేశారన్న ప్రచారం జరిగింది. ఏకంగా ద్వారపాలక విగ్రహాలనే తొలగించారన్న వదంతులు కూడా వ్యాపించాయి.వీటిపై కేరళ హైకోర్టు తనకు తానుగా సుమోటో విచారణ చేపట్టింది. బంగారు తాపడం పనులకు సంబంధించిన మొత్తం రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.