భారత్ న్యూస్ తిరుపతి…శ్రీవారి అన్నప్రసాదాల నాణ్యతకు ‘AI జల్లెడ’
తిరుమల :
శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల నాణ్యత పెంపులో భాగంగా టీటీడీ కొనుగోలు చేస్తున్న నిత్యావసర సరకుల్లో నాణ్యత 100 శాతం ఉండేలా చూసేందుకు టీటీడీ ‘విజన్ బేస్డ్ సార్టింగ్ యంత్రాలను’ అందుబాటులోకి తెచ్చారు.
టీవీఎస్ సంస్థ రూ.40 లక్షలు వెచ్చించి రెండు అధునాతన యంత్రాలను అందించింది.
ముందుగా నిత్యావసర సరకులు, పప్పుదినుసులను ఈ యంత్రంలోకి వేయగానే AI సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వాటిని గ్రేడింగ్ చేస్తుంది
