మహా అన్న సమారాధన.

భారత్ న్యూస్ రాజమండ్రి….మహా అన్న సమారాధన.

కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల ఆరో తేదీ నుండి ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు దేవస్థానం ప్రాంగణం వద్ద భక్తుల కోసం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్రీ కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు.