భారత్ న్యూస్ శ్రీకాకుళం….శివ స్వాములపై లాఠీఛార్జ్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం
బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
విజయవాడ, ఫిబ్రవరి. 10(అర్ ఎన్ ఐ)
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో, మల్లన్న దర్శనానికి వచ్చిన శివ స్వాములు, భక్తులపై పోలీసులు జరిపిన అమానుష లాఠీఛార్జ్ను భారతచైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ అహంకారానికి, ఆలయ అధికారుల చేతకానితనానికి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల కంటే హీనంగా చూడటం, శాంతియుతంగా నిరసన తెలిపిన స్వాములపై లాఠీలు ఝుళిపించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు.
అధికారుల వైఫల్యం.. భక్తులపై దాడి
ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం వల్లే ఈ దారుణమైన పరిస్థితి తలెత్తిందని రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు. గంటల తరబడి భక్తులను క్యూలైన్లలో నిలబెట్టి, వారి సహనాన్ని పరీక్షించారని, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అధికారుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దర్శనం కోసం ఆవేదనతో ముందుకు వచ్చిన భక్తులపై విచక్షణారహితంగా దాడి చేయడం ఏ రకమైన పాలన అని ఆయన ప్రశ్నించారు.
దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి
భక్తులపై, మాల ధరించిన శివ స్వాములపై లాఠీలతో దాడి చేసిన పోలీసు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే భయోత్పాతాన్ని సృష్టించడం దారుణమన్నారు. ఈ ఘటనపై కేవలం విచారణతో సరిపెట్టకుండా, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి
ఈ సిగ్గుచేటు ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖా మంత్రి తక్షణమే యావత్ హిందూ సమాజానికి, శివ స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. దేవాలయాలను ఆదాయ వనరులుగా కాకుండా, భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు సంబంధించిన పవిత్ర స్థలాలుగా చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
శ్రీశైలం ఘటన సిగ్గుచేటు.. సీఎం, దేవాదాయ మంత్రి భక్తులకు క్షమాపణ చెప్పాలి

దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి