భారత్ న్యూస్ తిరుపతి…Ammiraju Udaya Shankar.sharma News Editor….తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: టీటీడీ
ఏపీలోని తిరుమలలో అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు.

ఈ సర్వీసును ఉచితంగా అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. తొలి దశలో భాగంగా 150 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
టీటీడీలో ఇప్పటికే 21 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని, వారు ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.