భారత్ న్యూస్ విజయవాడ…కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం
• ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి జరిగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆలయ ఈవో శ్రీ వి.కె. శీనానాయక్ ఆహ్వానించారు. శుక్రవారం శాసన సభ విరామ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆహ్వాన పత్రికతోపాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.
