విశాఖపట్నం సిటీ పోలీస్.Diverted traffic

   

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖపట్నం సిటీ పోలీస్

             Diverted traffic

సింహాచలం….
గిరి ప్రదక్షిణ సందర్భముగా ఈ క్రింది ఉదహరించిన మార్గములలో తేదీ 09.07.2025 ఉదయం 06.00 గంటల నుండి తేదీ 10.07.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విదించబడును.అందువలన ప్రజలు ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణించవలెను

  1. సత్యవరం (సత్తరువు) జంక్షన్ నుండి అడవివరం జంక్షన్ వరకు, భక్తుల వాహనములను మాత్రమే అనుమతించబడును. అక్కడ నుండి హనుమంతువాక జంక్షన్ వైపునకు ఎటువంటి వాహనములను అనుమతించబడవు.
  2. గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ నుండి పాత గోశాల జంక్షన్ వైపునకు ఎటువంటి వాహనములను అనుమతించబడవు.
  3. పెందుర్తి, పినగాడి మీదగా వేపగుంట జంక్షన్ వైపునకు ఎటువంటి బారీ వాహనములను అనుమతించబడవు.
  4. NAD జంక్షన్ నుండి గోపాలపట్నం, వేపగుంట మరియు పెందుర్తి వైపునకు ఎటువంటి బారీ వాహనములు అనుమతించబడవు.
  5. అనకాపల్లి నుండి విశాఖపట్నం సిటీ వైపునకు వచ్చు బారీ వాహనములు లంకెలపాలెం జంక్షన్ వద్ద నుండి సబ్బవరం మీదగా ప్రయాణం చేయవలెను.
  6. తేదీ 09.07.2025 ఉదయం 06.00 గంటల నుండి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య ఎటువంటి వాహనములను అనుమతించబడవు. ప్రత్యమ్నయంగా దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, పెందుర్తి, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించవలెను.
  7. అడవివరం నుండి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచా వచ్చు భక్తులు వారి వాహనములను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ నందు నిలుపుకొని కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవలెను.
  8. గిరిప్రదక్షిణ నిమిత్తం వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చు భక్తులు సింహపురి కొలని వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశములు అయన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలములలో వాహనములను నిలుపుకొని కాలినడకన తొలి పావంచ వరకు చేరుకొనవలెను.
  9. గిరిప్రదక్షిణ నిమిత్తం, హనుమంతవాక వైపు నుండి వచ్చే బక్తులు ఆదర్శనగర్ డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి., పాయింట్ అరిలోవ ల లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ మరియు డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద మీ వాహనాలను పార్క్ చేసి అచ్చట దేవస్తానము వారు ఏర్పాటు చేసిన ఉచిత చిన్న బస్సులలో ఆడివివరం న్యూ టోల్గేటు/ పైనాపిల్ కాలనీ వరకు చేరుకొనవలెను.
  10. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు మరియు ఇతర వాహనదారులు విశాఖపట్నం సిటీ లోనికి అనుమతించబడవు. వారు ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించవలెను.
  11. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు మరియు ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకొనవలెను.
  12. గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుండి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు అనుమతించబడవు.
  13. హనుమంతువాక జంక్షన్ మరియు వెంకోజి పాలెం జంక్షన్ వద్ద భక్తులు రహదారి దాటుట వలన వాహనదారులకు కొద్దిపాటి అసౌకర్యం కలిగినప్పటికీ, జాతీయ రహదారి గుండా ప్రయాణించి, గమ్యస్థానం చేరుకొనవలెను.
  14. జోడుగుల్లపాలెం జంక్షన్ నుంచి హనుమంతవాక జంక్షన్ వైపునకు, హనుమంతవాక జంక్షన్ నుండి జోడుగుల్లపాలెం జంక్షన్ వైపునకు ఎటువంటి వాహనములు అనుమతించబడవు. ఆయా పరిసర ప్రాంతవాసులు విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారిని చేరుకొనవలెను.
  15. సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ జంక్షన్ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపునకు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు.
  16. ఆరిలోవ హెల్త్ సిటీ కీ వెళ్లవలసిన వారు ఆదర్శనగర్, ఓల్డ్ డైరీ ఫార్మ్ జంక్షన్ వద్ద నుండి ఆరిలోవ మీదుగా ప్రయాణించి, ఆరిలోవ హెల్త్ సిటీ కీ చేరుకొనవలెను.
  17. వెంకోజిపాలెం జంక్షన్ నుండి అపుఘర్ జంక్షన్ వైపు వేళ్ళు అన్ని వాహనములను, భక్తులు రద్దీ దృష్ట్యా అనుమతించబడవు.
  18. అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళవలసిన అన్ని ప్రైవేటు వాహనములు, ట్రావెల్ బస్సులు ఆనందపురం వద్ద మళ్ళించబడును. కావున తగు చర్యలు తీసుకోవలెను.
  19. ఇనార్బిట్ మాల్ దగ్గర నుండి కైలాసపురం, ఎన్జీవోస్ కాలనీ, మాధవధార ఉడా కాలనీ మీదుగా మారియట్ హోటల్ వరకూ (48 A బస్సు రూటు లో) ఎటువంటి వాహనములు అనుమతించబడవు. అలాగే మాధవధార జంక్షన్ నుండి మాధవ స్వామి గుడి వరకు మరియు తిరుగు ప్రయాణం రోడ్డు నందు కూడా ఎటువంటి వాహనములు అనుమతించబడవు.
  20. జాతీయ రహదారి NSTL ప్రక్కన ఉన్న అమ్మ వంటిల్లు దగ్గర నుండి కుమారి కళ్యాణ మండపం వరకు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు.
  21. విజయనగరం, శ్రీకాకుళం వైపు నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు ఎయిర్పోర్ట్ కు, బస్ స్టేషన్ కు, గాజువాక వైపు వెళ్ళు అన్ని వాహనములు ఆనందపురం నుండి పెందుర్తి మీదుగా చేరుకొనవలెను.

కావున విశాఖపట్నం నగర ప్రజలు, విశాఖపట్నం సిటీ పోలీసువారి సూచనలు పాటించి సహకరించమని అభ్యర్థన