వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు, భక్తులకు ముఖ్య సూచనలు:

భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు, భక్తులకు ముఖ్య సూచనలు:

  1. గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునే వారు ముందుగా కమిటీని ఏర్పాటు చేసుకొని బాధ్యత తీసుకోవాలి.
  2. పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత మున్సిపాలిటీ/పంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
  3. వ్యక్తిగత స్థలాలలో విగ్రహాలు పెట్టేవారు యజమాని అనుమతి తీసుకోవాలి.
  4. మండపాలు, విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలకు, ట్రాఫిక్‌కి ఎటువంటి ఆటంకం కలగరాదు.
  5. మైకులు, సౌండ్ బాక్స్‌లకు డీఎస్పీ గారి అనుమతి తప్పనిసరి. డీజే లకు అనుమతి లేదు.
  6. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరపరాదు.
  7. హుండీలు, విలువైన వస్తువులు ఉంచినట్లయితే పూర్తి బాధ్యత కమిటీదే.
  8. విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని, షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  9. ఇతర మతాల వారికి, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా చూడాలి.
  10. విభేదాలు రాకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
  11. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు, ఇతర అనుచిత కార్యక్రమాలు జరగరాదు. ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
  12. ఎవరినీ బలవంతంగా చందాలు అడగరాదు. బలవంతపు వసూళ్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాము.
  13. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
  14. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  15. నిమజ్జన ఊరేగింపుల సమయంలో మద్యం సేవించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం అస్సలు అనుమతించబడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.
  16. ఊరేగింపు తేదీలు, కార్యక్రమ వివరాలు ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. వాహనాల డ్రైవర్ల ఆధార్ కాపీలు, వివరాలు ఇవ్వాలి.
  17. మండపాల ఏర్పాటు వివరాలు, నిబంధనలు పాటిస్తామన్న నోటరీ పత్రం పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి.

👆🏻👆🏻👆🏻పై సూచనలు పాటించడం ద్వారా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సాఫీగా, భక్తిశ్రద్ధలతో జరుగుతాయని అవనిగడ్డ సర్కిల్ పోలీస్ వారి తరపున విజ్ఞ్యప్తి చేయడం జరుగుతుంది.