శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఆందోళన.

భారత్ న్యూస్ తిరుపతి.శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఆందోళన

AP: తిరుమలో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం తెల్లవారుజామున శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు భారీగా భక్తులు చేరుకున్నారు. అయితే, టికెట్లను ముందుగానే జారీ చేయడంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. భక్తుల రద్దీ నియంత్రించలేనంతగా ఉండటంతో ముందుగానే టికెట్లను జారీ చేసినట్లు తెలుస్తోంది….