భారత్ న్యూస్ తిరుపతి….తిరుమలలో లోయలో దూకిన భక్తుడు
తిరుమల నడకమార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ భక్తుడు లోయలోకి దూకాడు.
ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని లోయలో పడిన భక్తుడిని బయటకు తీశారు.

స్వల్పంగా గాయపడటంతో తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రుడిని కడప జిల్లా దోర్నపాడు గ్రామానికి చెందిన మాధవ రాయుడుగా గుర్తించారు.