భారత్ న్యూస్ వరంగల్….. …..ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్రోక్తంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.


దాదాపు 225 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.