శ్రీవారి నవంబర్‌ కోటా దర్శన టికెట్ల విడుదల తేదీలివే..

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీవారి నవంబర్‌ కోటా దర్శన టికెట్ల విడుదల తేదీలివే..

తిరుమల :

శ్రీవారి నవంబర్‌ నెల దర్శన కోటా విడుదల వివరాలను తితిదే ప్రకటించింది. ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటి లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆర్జిత సేవా టికెట్లు 21న ఉదయం 10 గంటలకు.. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయనున్నట్లు తితిదే పేర్కొంది.