శ్రీశైలంలో స్పర్శ దర్శనం రద్దు

భారత్ న్యూస్ రాజమండ్రి….శ్రీశైలంలో స్పర్శ దర్శనం రద్దు

శ్రీశైలం :

ఏపీలోని శ్రీశైల మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో జూలై 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 1.45 నుంచి. 3.34 వరకు ఈ దర్శన అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఒక రోజు
ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.